మోపాల్ ఉపాధ్యాయురాలి సస్పెన్షన్


Tue,January 10, 2017 11:59 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : మో పాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యారాలు పద్మజను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ ఉత్తర్వు లు జారీ చేశారు. మోపాల్ ఎస్జీటీగా ఉన్న పద్మజ ప్రస్తుతం మాక్లూర్ మండలం చిన్నాపుర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. పద్మజ విధులకు హాజరు కాకపోవ డంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదని, పాఠశాలలో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుందని గ్రా మస్తులు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై కలెక్టర్ డాక్టర్ యోగితారాణా రెవెన్యూ అధికారులతో స్వయంగా విచారణ జరిపించారు. జిల్లా విద్యాశాఖాధికారి నాం పల్లి రాజేశ్ సైతం కొన్ని రోజుల క్రితం పాఠశాలకు వెళ్లి స్వయంగా విచారణ చేశారు. విచారణలో సువర్ణ విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ఇష్టం వచ్చిన సమయంలో రావడం, పోవడం వాస్తవమేనని తెలింది.

దాంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరానికి సంబంధించిన సువర్ణ అటెండెన్స్ వివరాల కోసం జిల్లా విద్యాశాఖాధికారి వివరణ కోరగా అది తమవద్ద లేదని సమాధానం చెప్పినట్లు తెలిసింది. అయితే ఒక ఉపాధ్యాయ సంఘం నాయకులు పద్మజను ఎందుకు సస్పెండ్ చేశారని జిల్లా అధికారిపైనే ఒత్తిడి చేయించారని తెలిసింది.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS