17 వరకు సమగ్ర నివేదికలు సమర్పించాలి

Tue,January 10, 2017 11:59 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి సమగ్ర నివేదికలను ఈ నెల 17 వరకు పాఠశాల డైరెక్టరేట్‌కు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ డీఈవోలను ఆదేశించారు. మంగళవారం రాత్రి పా ఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ జిల్లా విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేసే దిశలో పని చేస్తుందని అన్నారు. దాంట్లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల వివరాలు, విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలను సమగ్రంగా సమర్పించాలని కోరారు.

దాంతోనే పాఠశాలల అభివృద్ధి ఆధారపడి ఉన్న నేపథ్యంలో పూర్తి వివరాలను అందించాలని కోరారు. దాని కోసం ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న వాటితో పాటు, ఈ విద్యా సంవత్సరం యూడైస్, చైల్డ్ ఇన్‌ఫోతో పాటు సమగ్ర సమాచారం అందించాలని కోరారు. పూర్తి వివరాలను 17 తరువాత సమీక్షించి దానిని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవో నాంపల్లి రాజేశ్ పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...