సెలవుల్లో జాగ్రత్తలు పాటించాల్సిందే..


Tue,January 10, 2017 11:59 PM

నిజామాబాద్ క్రైం : సంక్రాంతి సెలవులకు వెళ్లే వారు పలు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ అన్నారు. నిత్యం వివిధ ప్రాంతాలకు వస్తువుల విక్రయాల పేరుతో వచ్చే కొత్త వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వా రి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. శివారు ఏరియాల్లో పగటి వేళల్లో తాళం వేసి ఉండే ఇళ్లను గమనించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడే అవకాశం ఉంటుందని అలాంటి వాటిపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇంట్లో ఉండే విలువైన వస్తువులను ఇతరులకు ఇచ్చి నమ్మి వెళ్లకూడదన్నారు.

ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళితే చు ట్టుపక్కల వారికి అందుబాటులో ఉం డాలన్నా రు. ఇంట్లో ఒంటరిగా ఉండే వారు అపరిచిత వ్యక్తులు వచ్చి ఏవైనా వివరాలు అడిగితే అలాంటి వారిని నమ్మకూడదని సూచించారు. సెలవులో ఊరు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు ఉంచకూడదని, ఏమైనా ఉన్నట్లయితే వాటిని బ్యాంకు లాకర్‌లో భద్రపరుచుకోవాలని సీపీ తెలిపారు. ఊళ్లకు వెళ్లే టప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వల్సిందిగా సూచించారు. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు తమ వంతుగా విధులు నిర్వర్తిస్తారని, దీంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంటుందని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS