ప్రభుత్వ వైద్యులకు ప్రోత్సాహకాలు


Tue,January 10, 2017 11:58 PM

ఖలీల్‌వాడి : జిల్లాలో ప్రభుత్వ దవాఖాన ల్లోనే ప్రసవాల సంఖ్యను పెంచుతున్న వైద్యులకు కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ప్రోత్సాహకాలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి కార్యక్రమాన్ని పకడ్బందీ అమలు చేస్తున్న జిల్లాలోని పోతంగల్ పీహెచ్‌సీ స్త్రీ వైద్యనిపుణురాలు సమీన్‌కు కలెక్టర్ రూ.10వేల నగదు రివార్డు ప్రకటించారు. డిచ్‌పలి ్ల పీహెచ్‌సీ వైద్యురాలు అశ్వినికి, చౌట్‌పల్లి పీహెచ్‌సీ వైద్యురాలు సంజన, రెంజల్ పీహెచ్‌సీ వైద్యురాలు నస్రీన్ ఫాతీమాలకు ప్రశంసా పత్రాలను అందిస్తామని కలెక్టర్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ఈ రివార్డులను గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటి తెలిపారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS