రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో జిల్లాకు చాంపియన్‌షిప్

Tue,January 10, 2017 11:58 PM

నిజామాబాద్ స్పోర్ట్స్ : కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ జిల్లా బాలికలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఇందులో భాగంగా జిల్లా బాలికల విభాగంలో 40 కేజీల కేటగిరిలో పి. నవనీత కాంస్య పతకం, 43 కేజీల కేటగిరిలో ఎం. సంధ్య రజత పథకం, 46 కేజీల కేటగిరిలో బి. స్నేహా రజత పతకం, 49 కేజీల కేటగిరిలో బి. నిర్మల స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. అదే విధంగా బాలుర విభాగంలో జె. ఈశ్వర్ కాంస్య పతకాన్ని సాధించాడు. ముగింపు కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ వ్యక్తిగత పతకాలు, చాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేశారు. జిల్లా రెజ్లర్ల బృందానికి సీనియర్ రెజ్లర్ తుంగపల్లి శ్రీనివాస్, పీఈటీ భాగ్యలక్ష్మి, కోచ్ కం మేనేజర్లుగా వ్యవహరించారు.

ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి టోర్నీలో భాగంగా వివిధ జిల్లాలో నిర్వహించిన టోర్నీలో జిల్లా జట్లు పాల్గొన్నాయి. వరంగల్ జిల్లా భూపాల పల్లిలో ఉన్న అంబేద్కర్ స్కేడియంలో నిర్వహిస్తున్న కబడ్డీ రాష్ట్ర స్థాయి టోర్నీలో జిల్లా బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పీకర్ మధుసుధనాచారి హాజరయ్యారు. జిల్లా బాలబాలికల జట్లకు పీఈటీ గంగామురళి, శ్రీనివాస్ కోచ్ కం మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న హాకీ టోర్నీలో జిల్లా బాలబాలికల జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. మొదటి రోజు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన వివిధ మ్యాచ్‌లలో ప్రతిభను కనబర్చారు. పీఈటీ దండుల చిన్నయ్య, అంజు కోచ్ కం మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...