సమన్వయంతోనే.. సమస్యల పరిష్కారం..


Tue,January 10, 2017 11:58 PM

వినాయక్‌నగర్ : గ్రామ స్థాయిలో షీ కమిటీలు, పోలీస్, రెవెన్యూ జెండర్ కమిటీల సమన్వయంతోనే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అ న్నారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లో మంగళవారం శిశు మహిళా సంక్షేమ, వ యోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సఖి షీ కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, వేధింపులు నిర్మూలించడానికి ప్రాథమిక స్థాయిలో కృషి చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్లలో మహిళలు ఫి ర్యాదు చేయడానికి వచ్చినప్పుడు సున్నితంగా సమస్య తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలన్నారు. గ్రామ కమిటీలు, దత్తత గ్రామ కమిటీలు అన్ని పోలీసులతో కలిసి కౌన్సెలింగ్‌లు నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం గ్రామ సంఘంలో సమస్యను పరిష్కరించుటకు సఖి షీ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో పరిష్కారం కాని కేసులను ఎస్‌హెచ్‌వో స్థాయి కమిటీకి పంపాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కారం కానీ కేసులపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని అన్నారు.

డివిజన్ స్థాయిలో వచ్చిన ఫిర్యాదులను సఖి షీ కమిటీ సభ్యులు కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. ప్రతి మూడు మాసాలకోసారి నిర్వహించే సమావేశంలో పరిష్కరించిన కేసుల వివరాలు, పరిష్కారం కానీ కేసుల వివరాలు, లైంగికదాడులు అరికట్టేందు కు ముందస్తు చర్యలు చేపడతామన్నారు. వరకట్నం తీసుకోకూడదనే ఆలోచన ముందుగా మననుంచే రావాలని అ న్నారు. జిల్లా స్థాయి సఖి కేంద్రంలో వైద్య, పోలీస్, న్యాయ సహాయాలన్నీ ఒకేచోట అందజేయబడుతుందని అన్నారు. వీలైనంత త్వరగా కమిటీలు ఏర్పాటు చేసి పనితీరును చూపించాలని అన్నారు. పోకిరీలు, ర్యాగింగ్, వేధింపులకు గురిచేస్తున్న వారిపై షీ టీం, సామాజిక అరాచకాలపై షీ కమిటీలు పనిచేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి..


వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాల ని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ శర్మ అ న్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వీలైనంత వరకు అక్కడే పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. పోలీసులు మహిళల పట్ల గౌరవంగా ఉండాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాహుల్‌రాజ్, బోధన్ సబ్‌కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఏసీపీ ఆనందర్‌కుమార్, ఐసీడీఎస్ ఇన్‌చార్జీ పీడీ ఝాన్సీలక్ష్మి, లైంగిక వేధింపుల నిరోధక చట్టం అధ్యక్షురాలు కవిత, సఖి లీగల్ అడ్వైజర్ నీరజారెడ్డి, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS