రసవత్తరంగా జాగృతి క్రికెట్ టోర్నీ


Tue,January 10, 2017 11:57 PM

నిజామాబాద్ స్పోర్ట్స్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి నాకౌట్ క్రికెట్ టోర్నీ రసవత్తరంగా కొనసాగుతోంది. జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ రెహాన్ ఆధ్వర్యంలో కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో టోర్నీ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఒక్కో మ్యాచ్‌కు 16 ఓవర్ల చొప్పున కేటాయించి మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భాగంగా మూడో రోజైన మంగళవారం నిర్వహించిన మ్యాచుల్లో మొదటి మ్యాచ్‌కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంథని రాజేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు బాజిరెడ్డి జగన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ఇరు జట్లను పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి ప్రారంభించారు.

71 పరుగులతో యార్క్ షైర్ గెలుపు...


మొదటి మ్యాచ్‌లో యార్క్‌షైర్, భీమ్‌గల్ లెవెన్ ఫ్రెండ్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భీమ్‌గల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి. 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యార్క్ షైర్ జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.

45 పరుగులతోగంగా ఫార్మసీ ...


రెండో మ్యాచ్‌లో గంగా ఫార్మసీ, రెడ్‌స్టార్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గంగా ఫార్మసీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రెడ్ స్టార్ జ్టటు 13.1 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో గంగా ఫార్మసీ జట్టు 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

3 వికెట్లతో సూపర్ స్టార్ విజయం...


మధ్యాహ్నం జరిగిన మూడో మ్యాచ్‌లో డీసీసీ లెవెన్, సూపర్ స్టార్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన డీసీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ బరిలోకి దిగిన సూపర్ స్టార్ జట్టు 14.5 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 132 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు మహ్మద్ రఫిక్, డీ. శ్రీనివాస్ అంపైర్లుగా, ఉమర్ స్కోరర్‌గా వ్యవహరించారు. బుధవారం మూడు జట్ల మధ్య నిర్వహించే మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల ఆధారంగా ఫైనల్స్‌ను వెల్లడించనున్నారు. అంతే కాకుండా నిజామాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్టుకు కామారెడ్డిలో నిర్వహిస్తున్న మ్యాచుల్లో గెలుపొందిన జట్టుకు తుది పోరును నిర్వహించి విజేత జట్టును రాష్ట్ర స్థాయికి పంపనున్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS