కష్టాలు దూరం చేసేది భగవంతుడే..

Tue,January 10, 2017 11:57 PM

నిజామాబాద్ కల్చరల్ : సమాజంలోని ప్రతి మనిషి కష్టాల్లో ఉన్నాడని అవి దూరం కావాలంటే పరమాత్ముడిని మంత్రం రూపంలో ఓం నమో భగవతే వాసుదేవయ, ఓం నమో నారాయణ నమః అంటూ స్మరించుకోవాలని శ్యామసుందరాచారి వివరించారు. మంగళవారం జెండాబాలాజీ ఆలయంలో తిరుప్పావై ప్రవచనలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఇద్దరు తల్లులు ఉన్నారని ఒకరు దేవిక, మరొకరు యశోదదేవి అని అందుకే ఈ రెండు మంత్రాలు చదవడం ద్వారా పరమాత్ముడుని జ్ఞాపకం చేసుకున్నవాళ్లు అవుతామన్నారు. అహంకారం వదిలి భగవంతున్ని పూజించాలన్నారు. ఉదయం ఆలయ అర్చకులు నాగరాజాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి సామూహిక విష్ణు సహస్ర పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏవో రవీందర్, జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...