గ్రామసంఘాల పనితీరు బాగుంది


Tue,January 10, 2017 11:56 PM

ఎడపల్లి : గ్రామాల్లోని సంఘాల పని తీరు బాగుందని బోధన్ సబ్‌కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ పామెల సట్‌పతి అన్నారు. ఎడపల్లి మండల కేం ద్రంలోని ఐకేపీ గ్రామ సంఘాల పనితీరును మంగళవారం సమీక్షించారు. గ్రామ సంఘాల నిర్వహణ, వాటి పనితీరు, ఈ సంఘాలతో లాభాలు వంటి అంశాలను సమీక్షించారు. నగదు రహిత లావాదేవీలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై స భ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఐకేపీ ఏ పీఎం సాయిలు, ఈజీఎస్ ఏపీవో సాయిబాబా, గ్రామసమాఖ్య సభ్యులు ఉన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS