ఆర్మూర్‌లో దుకాణాలపై దాడులు

Tue,January 10, 2017 11:56 PM

ఆర్మూర్ టౌన్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలిథిన్ కవర్లు వినియోగిస్తున్న దు కాణాలను గుర్తించేందుకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఎ.శైలజ స్వయంగా పాలిథిన్ నిరోధక బృందంతో కలిసి దాడులు నిర్వహిచారు. పట్టణంలోని ఆర్టీసీ కా ంప్లెక్స్‌లో ఉన్న వర్ష ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్, మహాలక్ష్మి కాలనీలో ఉన్న విమల్ ఏజె న్సీస్‌లో 50 మైక్రాన్ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న పాలిథిన్ కవర్‌లను వినియో గించడాన్ని గుర్తించారు. దుకాణం యజమానులు దినేశ్‌కుమార్, మోహన్‌జోషీకి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కమిషనర్ శైలజ మాట్లాడుతూ.. 50 మైక్రాన్ కంటే తక్కువ సామర్థం ఉన్న పాలిథిన్ వినియోగిస్తే జరిమాన విధిస్తామన్నా రు. పద్ధతి మారకపోతే దుకాణం సీజ్ చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో శానిటరీ ఎస్సై జయరాజ్, పింజ అశోక్, అరుణ్, మైదం రవి, రాంసింగ్, నరేశ్, శంకర్ తదిత రులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...