ఫిబ్రవరి 26 అర్హత పరీక్ష

Tue,January 10, 2017 11:56 PM

జామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : చదువు మధ్యలో ఆపేసిన వారికి, డిగ్రీ చదువుకోవాలనుకునే వారికి కేర్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష కోసం ఫిబ్రవరి 16 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేర్ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ కళవతి తెలిపారు. అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉం డాలన్నారు. పరీక్ష రుసుము రూ. 300లు మీసేవ లేదా ఆన్‌లైన్‌లో చెల్లించి రశీదు పొందాలన్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ పత్రాలను, ఫీజు చెల్లించు రశీదును, ఫొటోతో జతచేసి స్టడీ సెంటర్‌లో అందజేయాలని కోరారు. ప్రవేశపరీక్ష ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 08462-656677, 73829 29815 నంబర్లను సంప్రదించాలని కోరారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...