చదువులమ్మ ఒడిలో సంక్రాంతి సంబురాలు


Tue,January 10, 2017 11:55 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : నగరంలోని నలంద హైస్కూల్‌లో మంగళవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొమ్మల కొలువు ఏ ర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గాలి ప టాలు ఎగురవేశారు. ముఖ్య అతిథిగా మేయర్ ఆకుల సుజాత హాజరై చిన్నారులకు భోగిపళ్లు పోశారు. కా ర్పొరేటర్లు గంగామణి, కనకం సుధా, సిర్ప సువర్ణ, పా ఠశాల నిర్వాహకుడు మురళీకృష్ణ, ప్రధానోపాధ్యాయినీ పద్మావతి పాల్గొన్నారు.

విశ్వ వికాస్ పాఠశాలలో...


నగరంలోని 14వ డివిజన్‌లోని సాయినగర్‌లో గల విశ్వవికాస్ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎనగందుల మురళి ముఖ్య అథితిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. టీఆర్‌ఎస్ నాయకుడు రవీందర్ రెడ్డి, పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.

శంకర్‌భవన్ పాఠశాలలో..


నిజామాబాద్ స్పోర్ట్స్ : ఇన్నర్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో శివాజీనగర్‌లోని శంకర్ భవన్ పాఠశాలలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. క్లబ్ అ ధ్యక్షురాలు కాపర్తి అనిత ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రావులపల్లి జయ, రత్న, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మానిక్‌భవన్ పాఠశాలలో..


రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో శివాజీనగర్‌లోని మానిక్ భవన్ పాఠశాలలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు రావులుపల్లి జగదీశ్వర్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పతంగులు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజ్‌కుమార్ సుబేదార్, వి.శ్రీనివాస్‌రావు, మాణిక్యం, మోటూరి లక్ష్మణ్, హెచ్‌ఎం విఠల్ పాల్గొన్నారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో...


వాసవి క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కోటగల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు వలపుశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. క్లబ్ కార్యదర్శి గుడుపల్లి రమేశ్, కొవ్వూరి రమేశ్ చంద్రం, మా మిడి సంతోష్, జి. శ్రీనివాస్, పబ్బ మహేశ్, ప్రవీణ్, శ్రీనివాస్, విజయ్ పాల్గొన్నారు.

సిల్వర్ వింగ్స్ పాఠశాలలో...


వినాయక్‌నగర్‌లోని సిల్వర్ వింగ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా పతంగులు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్ భార్గవ్, చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి మోడల్ స్కూల్‌లో..


డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ గణేశ్ కుమార్ పాల్గొన్నారు.

500
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS