క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా


Tue,January 10, 2017 11:54 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకా లు బడుగు, బలహీన వర్గాలకు అందించుటకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గుణాత్మక విద్యనందించాలని కోరారు. పిల్లలకు దుస్తులు, పుస్తకాలు, పౌష్ఠికాహారం అం దించడంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం విరివిగా నిధు లు ఖర్చు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుశీల్ కుమార్, మోహన్, మోతె సాయ న్న, రాంచందర్ గైక్వాడ్, జిల్లా నాయకులు గంగాధర్, ప్రభాకర్, సాయిలు, రవి, వనిత, సునీత త దితరులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS