పాన్ పరేషాన్

Tue,January 10, 2017 03:09 AM


బోధన్, నమస్తే తెలంగాణ: నగదు లభ్యత లేక నానా అగచాట్లు పడుతూ... పొదుపు ఖాతాల్లోని డబ్బు ఉపసంహరణ కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా ఇంకా తిరుగుతున్న సామాన్య ప్రజలపై పాన్ అనుసంధానం పేరిట మరో పిడుగుపడింది. బ్యాంకుల్లోని ఖాతాదారుల పొదుపు ఖాతాలకు పాన్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఖాతాదారులందరి నుంచి బ్యాంకులు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పా న్) తీసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. పాన్ లేనట్లయితే... వారి నుంచి ఫారమ్-60 తీసుకోవాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. బ్యాంక్‌ల చు ట్టూ నగదు డిపాజిట్, ఉపసంహరణ కోసం 60 రోజులుగా ప్రజలు తిరిగి అలసిపోయారు. ఇప్పటికీ నగదు లభ్యత, ఉపసంహరణలో కోసం ఇబ్బందులు తప్పడంలేదు. ఇదిలా ఉండగా.... మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మరోసారి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందిని తాజా నిర్ణయం తో సృష్టించింది. పనులు మానుకుని తిరగడంతో పాటు... రాబోయే రోజుల్లో సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలకు పాన్ అనుసంధానంతో ఇబ్బందులు ఎదురవుతాయని పరిశీలకులు అంటున్నారు. ఆదాయం పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడం, నల్లధనం పోగు కాకుండా చూడడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమే అయినప్పటికీ, తాజాగా అల్పాదాయవర్గాల ఖాతాలకు సైతం పాన్ కార్డు కావాలనడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తమౌతోంది.

అసలు ఇప్పటికీ, పాన్‌కార్డు అంటే ఏమిటో తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. జిల్లాలోని బ్యాంకు ఖాతాలకు నూరుశాతం ఆధార్ అనుసంధా నం జరిగిందని చెప్పవచ్చు. ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయి. వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయి తే, పాన్ కార్డుల ఉద్ధేశం మంచిదే అయినప్పటికీ, బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సామాన్య, అల్పాదాయ ఖాతాదారులు సైతం ప్రతీసారి ఆదాయం పన్నుశాఖకు వివరణ ఇ చ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. జన్‌ధన్, జీరో ఖాతాలకు ఈ ఆధార్ అనుసంధానం నుంచి మినహాయించినప్పటికీ, సామాన్య ప్రజల పొదుపు ఖాతాలు పెద్ద సంఖ్యలోనే ఉ న్నాయి. జిల్లాలోని వివిధ బ్యాంకుల ఖాతాదారుల పాన్‌కార్డు అనుసంధానం ఇప్పటి వరకు 35 శాతంగా మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఒకేసారి 50 వేలకు మించి డిపాజిట్లు, ఉపసంహరణలు జరిగినప్పుడు మాత్రమే బ్యాంక్‌లో పాన్ నంబర్ అడిగేవారు. ఇప్పుడు, వాటితో సంబంధంలేకుండా ఖాతాదారులందరూ పాన్ నంబర్లు ఇవ్వాల్సిందే... లేదంటే ఖాతాదారుడి అకౌంట్ మనుగడలో ఉండదు.

గడువు తక్కువతో గందరగోళం...


బ్యాంకుల పొదుపు ఖాతాలకు ఆధార్ కార్డు అనుసంధానం కోసం వచ్చే నెల 28 వరకు మాత్రమే కేంద్రం గడువు విధించింది. దీంతో ఇటు బ్యాంకింగ్ సిబ్బంది, పాన్‌కార్డులు తీసుకోవాల్సిన ఖాతాదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యే ప రిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బ్యాంకుల్లో పనిభారంతో అలసిపోయిన బ్యాంకింగ్ సిబ్బంది... మళ్లీ పాన్ అనుసంధానంతో గబారా పడుతున్నారు. మరోపక్క పాన్‌కార్డులు ఎలా తీసుకోవాలో తెలియక సామాన్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. పాన్‌కార్డును పొందాలంటే ఆధార్ కార్డు, గుర్తింపు పత్రం, చిరునామాను ధ్రువీకరించే పత్రంతో పాటు ఆదా యం పన్ను చట్టం 139వ సెక్షన్ కింద ఫారమ్-49ఏ ఇవ్వా లి. ఈ డిక్లరేషన్‌లో తమ ఆదాయం రెండున్నర లక్షల రూపాయలకు మించుతుందని, అందుకోసం తమకు పాన్‌కార్డు ఇవ్వాలన్న ఖాతాదారుడి అభ్యర్థన ఉంటుంది.

ఈ కారణంగానే రెండున్నర లక్షల రూపాయల మొత్తం పొదుపుఖాతాల్లో లేనివారిని కూడా అప్పుడప్పుడు ఆదాయం పన్నుశాఖ వివరణలు కోరుతుంది. ఏదో మామూలు ఆదాయం కలిగిన సామాన్యులు ఇటువంటి వివరణలు ఇవ్వడం చాలా కష్టం. పాన్‌కార్డులేని వారు ఫారం - 60 ఇవ్వవచ్చని ఉన్నప్పటికీ, దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే... పాన్‌కార్డులను వేలాదిమంది ఖాతాదారులు వచ్చే 49 రోజుల్లో పొందడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. పాన్‌కార్డును విడుదలచేసే సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్.. వాటి విడుదలకు కనీసంగా 28 రోజులు గడువు అడుగుతుంది. పాన్‌కార్డుల కోసం రుసుం రూ.76 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుతం ఒకేసారిగా పాన్‌కార్డులు డిమాండ్ పెరగడంతో దళారులు రంగప్రవేశం చేసి సామాన్య జనం నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రమాదమూ లేకపోలేదు.

392
Tags

More News

మరిన్ని వార్తలు...