వందరోజుల పనిదినాలు పూర్తి చేసుకోవాలి


Sat,December 7, 2019 12:15 AM

భైంసారూరల్ : మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభలు సర్పంచుల అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల ఎంపిక, చేయబోమే పనుల ప్రణాళికలను గ్రామసభలో తీర్మానించారు. మండలంలోని మాంజ్రీ గ్రామంలో కొత్తగా ఈజీఎస్ పనులు చేయబోయే వారికి జాబ్‌కార్డులను అందించారు. ప్రతి కూలీ వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజన్న, ఉప సర్పంచ్ ఈశ్వర్, పంచాయతీ సెక్రెటరీ పాండురంగ్, ఈజీఎస్ సిబ్బంది తదితరులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...