పకడ్బందీగా ‘పల్లె ప్రణాళిక’ అమలు


Wed,December 4, 2019 12:07 AM

నిర్మల్‌ టౌన్‌: ‘పల్లె ప్రణాళిక’ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కమిషనర్‌ రఘునందన్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. పల్లె ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోళ్లు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పల్లెప్రణాళికలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు కమిషనర్‌కు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు పల్లె ప్రణాళిక కింద మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయని, ప్రజా ప్రాధాన్యత పనులకే నిధులను ఉపయోగించాలన్నారు. పల్లె ప్రణాళిక పనులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, ప్రత్యేకాధికారులు కామారపు జగదీశ్వర్‌, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles