‘కడెం’పై ఆక్టోపస్‌!


Tue,December 3, 2019 12:28 AM

-ఉగ్రదాడుల్ని తిప్పికొట్టే దిశగా మాక్‌డ్రిల్‌
-ఆయకట్టు సిబ్బందికి, పోలీసులకు అవగాహన
-హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆక్టోపస్‌ బృందాలు
-అప్రమత్తంగా ఉండాలని సూచన

కడెం : పర్యాటక ప్రదేశాల వద్ద అనుకోని సంఘటనలు జరగడంతో పాటు, ఉగ్రవాదులు దాడులు చేయడం వంటి ఘటనలు ఎదురైనప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆక్టోపస్‌ సిబ్బంది సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆక్టోపస్‌ సిబ్బంది కడెం జలాశయంపై మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్‌ అదనపు ఏస్పీ వెంకట్‌రెడ్డి, ఖానాపూర్‌ సీఐ జయరాం, కడెం, ఖానాపూర్‌, దస్తురాబాద్‌, పెంబి ఎస్సైలు, పోలీసు సిబ్బందితో కలిసి ప్రాజెక్టుపై సోమవారం సాయంత్రం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రాజెక్టు వరదగేట్ల వద్ద మాక్‌డ్రిల్‌లో భాగంగా ఆయకట్టు సిబ్బంది, పోలీసులకు ఉగ్రవాదుల దాడులు, ప్రతి ఘటన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ...పర్యాటక ప్రదేశాల్లో అనుకోని సంఘటనలు జరగడంతో పాటు, ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిఘటనపై ఆక్టోపస్‌ సిబ్బంది సూచించిన విధానాలను పాటించాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బందితో పాటు ఆయకట్టు జేఈ శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles