కృత్రిమ గర్భధారణతో మేలైన ఫలితాలు


Tue,December 3, 2019 12:26 AM

లక్ష్మణచాంద: పశువులకు కృత్రిమ గర్భధారణతో మేలైన ఫలితాలు లభిస్తాయని పశువైద్యుడు అజయ్‌కుమార్‌ అన్నారు. ఆత్మ యాజమాన్యసంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని బోరిగాంలో పశువులకు కృత్రిమ గర్భధారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిసంపదను పెంచేందుకు ప్రభుత్వం పశువులలో కృత్రిమ గర్భధారణకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాదస్తు లక్ష్మి, ఆత్మవిభాగం సిబ్బంది శరణ్య, సంధ్య, తేజస్విని, పశువైద్యసిబ్బంది దీపిక, రాజేశ్వర్‌, వెంకన్న, రైతులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles