మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం


Wed,November 13, 2019 11:16 PM

కెరమెరి: గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎంపీపీ పేందోర్ మోతిరాం, జడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఝరి గ్రామంలో శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల్లో శ్మశానవాటికతో పాటు డంపింగ్‌యార్డులు నిర్మించి శుభ్రత పాటించేలా సర్పంచులు చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో మండలం అభివృద్ధి దశలో నడిచేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. శ్మశానవాటికలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వాజీద్‌పాషా, నాయకులు సెడ్మకి అమృత్‌రావ్, షేక్ యూసుఫ్, కోట్నాక కర్ణు, మూసా, దౌలత్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles