నేటి నుంచి బొగ్గు నాణ్యత వారోత్సవాలు


Wed,November 13, 2019 11:14 PM

సీసీసీ నస్పూర్ : ఈ నెల 14 నుంచి సిం గరేణి వ్యాప్తంగా బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను బుధవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో జీఎం లక్ష్మీనారాయణ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో నాణ్యత వారోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నా రు. మార్కెట్లో మన బొగ్గు-నాణ్యతతోనే నెగ్గు అనే అంశంపై ఈ సంవత్సరం బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారోత్సవాల సందర్భం గా ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్లు, జీఎం కార్యాలయంలో పతాకావిష్కరణ లు జరుగుతాయనీ, నాణ్యతపై ప్రతిజ్ఞలు ఉంటాయని పేర్కొన్నారు. బొగ్గు నాణ్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ గోవిందరాజు, ఈఅండ్‌ఎం డీజీఎం రాజశేఖర్‌రెడ్డి, సేఫ్టి డీజీఎం గుప్తా, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకా రాం, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles