జాతీయస్థాయిలో రాణించాలి


Wed,November 13, 2019 11:05 PM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ : జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లా, రాష్ట్రం పేరును నిలబెట్టాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-19 బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా క్రీడాకారిణి పద్మకు బుధవారం స్థానిక బస్టాండ్‌లో కోచ్ ఆమెకు వీడ్కోలు పలికారు. ఈనెల 18 నుంచి ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాక్సింగ్ శిక్షకుడు చందుల స్వామి, అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles