సురక్షిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలి


Wed,November 13, 2019 11:05 PM

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ : పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడులు లేకుండా, మత్తు పదార్థ్ధాలకు అలవాటు కాకుండా సురక్షిత పాఠశాలలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని డీఈవో టామ్నె ప్రణీత సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సురక్షత పాఠశాలలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈశిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లైంగిక వేధింపులకు గురికాకుండా, మత్తు పదార్థాల బారినపడకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం సోన్ సీఐ జీవన్‌రెడ్డి సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...