చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు


Wed,November 13, 2019 11:04 PM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: చదువుకున్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని బాలల పరిరక్షణ విభాగం అధికారిణి(ఐసీపీఎస్) శారద అన్నారు. స్థానిక ఎయిమ్ ఫర్ సేవా అనాథ శరణాలయంలో బుధవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు మరింత కష్టపడాలన్నారు. ప్రస్తుత కష్టాలతో కుంగిపోకుండా ఎదగాలని సూచించారు. విద్యతో పాటు సంస్కృతిని అందిస్తున్న ఎయిమ్ ఫర్ సేవా సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా గుస్సాడీ కళాకారులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రవికాంత్, కిశోర్‌కుమార్, వార్డెన్ మోతిరాం, శ్రీసరస్వతి శిశు మందిర్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధర్మరాజు, ఆచార్యుడు రాజేంధర్ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...