అబుల్ కలాం ఆశయ సాధనకు కృషి చేద్దాం


Tue,November 12, 2019 04:42 AM

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అజీం బిన్ యాహియా అన్నారు. పట్టణంలోని కలెక్టర్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన అబుల్ కలాం జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేసిన కలాం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధికారి ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, కలాం గుణాం సొసైటీ అ ధ్యక్షుడు మహ్మద్‌ఉస్మాన్, నాయకులు మజార్, నజిరోద్దీన్, గందం దేవీదాస్, ఇర్ఫాన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అయ్యన్నగారి పొశెట్టి, సాద సుదర్శన్, రమణారెడ్డి, చంద్రకాంత్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...