ఆటో బోల్తా..ముగ్గురికి గాయాలు


Mon,November 11, 2019 12:53 AM

భైంసా, నమస్తే తెలంగాణ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆటోబోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భైంసా పట్టణంలోని ఫైర్‌స్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో ప్రకాశ్, రజనీతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. పిప్రి కాలనీ నుంచి బస్టాండ్ వైపు వచ్చే ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఆటో డ్రైవర్ ప్రకాశ్ తన స్నేహితుడి ద్విచక్రవాహనంలో పెట్రోల్ అయిపోవడంతో ఆటోలో నుంచి కాలు ద్వారా ముందుకు తీసుకెళ్లాడు. ఫైర్ స్టేషన్ వద్ద ఒక్క సారిగా బైక్ బ్రేక్ కొట్టగా.. ఆటో డ్రైవర్ సైతం ఆకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో బోల్తా పడింది. అందులో డ్రైవర్ ప్రకాశ్‌తో పాటు ప్రయాణికురాలు రజనీకి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఏరియా దవాఖానకు తరలించారు. పట్టణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...