ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


Mon,November 11, 2019 12:53 AM

లోకేశ్వరం : మండలంలోని ధర్మోరా గ్రామంలో సర్పంచ్ మంద శారద, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి ఆదివారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి లబ్ధిపొందాలని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరగా ఏ గ్రేడుకు రూ. 1835, బి గ్రేడు రకానికి రూ. 1815 ప్రకటించిందన్నారు. పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో పంచగుడి సర్పంచ్ ఎల్లన్న, నాయకులు మంద భాస్కర్, ఆంజనేయుడు, అబేజ పటేల్, సంజీవ్‌రెడ్డి , ముత్తన్న, సాయన్న, ఈరన్న, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నర్సయ్య, సాయేందర్, తదితరులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...