మహాసభలు విజయవంతం చేయాలి


Mon,November 11, 2019 12:53 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : మానవ హక్కుల వేదిక 7వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావు అన్నారు. ఆదివారం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో చాలా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా తాము ముందుండి పోరాడమన్నారు. ఏజెన్సీలో గిరిజనులకు హక్కులు కల్పించాలన్నారు. 7వ రాష్ట్ర మహాసభలను ఉట్నూర్ కేంద్రంలోని రాంజీగోండ్ భవనంలో ఈనెల 16న నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాందాస్, రామారావు, అర్జు, సుగుణ, రంభాబాయి, అరుణ, శ్యాంరావు, జ్ఞానేశ్వర్, బాగుబాయి, రత్నమాల, లాజర్, రుబేన్, లింగగౌడ్ ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...