పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి


Mon,November 11, 2019 12:53 AM

ఉట్నూర్ రూరల్ : గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని శ్యాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంట్లోని చెత్తను గ్రామపంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో వేయాలని అన్నారు. ఇంటి పరిసరాలు, రోడ్డుపై, మరుగునీటి కాల్వలో పడేయకూడదని సూచించారు. 30 రోజుల ప్రణాళికలో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు. గ్రామంలో మురుగునీటి కాల్వలు లేని చోట వెంటనే నిర్మించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను తొలగించాలని అన్నారు. పాఠశాలకు నీటి వసతి కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండాల మల్లిక, ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అజిమొద్దీన్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సిగారే భారత్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జవ్వాద్ అన్సారీ, సీతారాం, శ్యాం, పోశన్న గ్రామస్తులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...