భక్తుల సందడి


Mon,November 11, 2019 12:53 AM

మహా అడెల్లి పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ర్టాలోని నాందేడ్, శివిని, నాగ్‌పూర్, ఇస్లాపూర్, అప్పారావుపేట్, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా డిపోల నుంచి ఆలయానికి బస్సు సర్వీసులు నడిచాయి.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...