విజయ డెయిరీ ద్వారా పాడి పశువులు ఇస్తాం


Mon,November 11, 2019 12:52 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : విజయ డెయిరీ ద్వారా పాడి పశువులను అందజేస్తామని టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని జిల్లా జైలును ఆయన సందర్శించారు. చేపల చెరువుతో పాటు పలు రకాల తోటలు, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీడీసీ చైర్మన్ మాట్లాడుతూ వివిధ నేరాలు చేసి జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలకు సత్ప్రవర్తనను నేర్పడంతో పాటు వివిధ పంటలను సాగు చేయించడం అభినందనీయమన్నారు. ఖైదీలు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తిరిగి నేరం చేయకుండా వృత్తి నైపుణ్యతలో వారికి శిక్షణను ఇస్తున్నారని తెలిపారు. వివిధ శాఖల ద్వారా రాయితీపై రుణాలను అందజేయడంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు.

జైలుశాఖ చేపట్టిన సంస్కరణలతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో వివిధ పనులు చేస్తున్న ఖైదీలకు బెయిల్ అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో పనిచేసిన రోజులు వేతనం కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. జైలులో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జైలు శాఖలో సైతం మార్పులు వచ్చాయన్నారు. పోటీ ప్రపంచంలో వ్యాపార రంగంలోకి జైలు శాఖ రావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శోభన్‌బాబు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, పలువురు జైలు సిబ్బంది ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...