ఉత్సాహంగా జోనల్‌స్థాయి టార్గెట్‌బాల్ పోటీలు


Sat,November 9, 2019 11:58 PM

ఎదులాపురం : జిల్లాకేంద్రంలో జోనల్‌స్థాయి టార్గెట్‌బాల్ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. పట్టణంలోని న్యూ హౌజింగ్ బోర్డులో ఉన్న మహాత్మ జ్యోతి బాఫూలే గురుకుల పాఠశాలలో జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్వంలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 100 మంది బాల బాలికలు హాజరయ్యారు. పోటీలను గురుకుల ప్రిన్సిపాల్ ప్రతిభరెడ్డి ప్రారభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని తర్వాత ఎంపిక పోటీలను ప్రారభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచినవారు రాష్ట్ర స్థా యి పోటీల్లో జిల్లా జట్టుకు ఎంపికవుతారన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి గుండి మహేశ, టీటీ సంఘం జిల్లా అధ్యక్షుడు రాష్ట్రపాల్, పీడీలు, పీఈటీలు కె.కృష్ణ, జ్యోతి, రేణుక ఎన్.స్వామి, సాయికుమార్, సంగీత, రాకేశ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

నేటీ నుంచి రాష్ట్ర స్ధాయి టార్గెట్ బాల్ పోటీలు
జిల్లా కేంద్రంలోని న్యూహౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న మహాత్మజ్యోతి బాఫూలే గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలను ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. పోటీలకు ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన సుమారు 400 మంది క్రీడాకారలు హాజరు కానున్నారు. అండర్-17, 19 విభాగంలో పోటీలు జరుగనున్నాయి. వీరికి భోజన, వసతి సాకర్యాన్ని కల్పించనున్నారు. దీనికోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బాల బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించేందకు మైదానాన్ని సిద్ధం చేశారు. మైదానాన్ని రంగురంగుల జెండాలతో అందంగా ముస్తాబు చేశారు. పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles