భక్తిశ్రద్ధలతో గంగాహారతి


Sat,November 9, 2019 04:16 AM

ఖానాపూర్: పట్టణంలో శుక్రవారం రాత్రి గంగాహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీవేంకటేశ్వర, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల అర్చకులు చక్రపాణినరసింహమూర్తి, నిమ్మగడ్డ సందీప్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళలు, భక్తులు కలిసి ఊరేగింపుగా పట్టణ సమీపంలోని గోదావరి చేరుకున్నారు. గంగామాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జయజయ జయ ధ్వానాల మధ్య హారతి సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల శోభారాణి, వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు అడ్డగట్ల రాజన్న, పొలంపెల్లి రమేశ్, ఊశకోల సుధాకర్, బీసీ రమేశ్, తుమ్మణపెల్లి లక్ష్మణ్, లింగాల రాము, లక్ష్మణ్, సింగు ప్రవీణ్, మహిళలు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కానాపూర్‌లోని లక్ష్మీవేంకటేశ్వర ఆలయం 35వ వార్షికోత్సవాలు శుక్రవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు చక్రపాణి నరసింహమూర్తి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రసన్నాంజనేయ శివపంచాయతన ఆలయ అర్చకుడు నిమ్మగడ్డ సందీప్‌శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles