కొనసాగుతున్న రెవెన్యూ ఉద్యోగుల నిరసన


Fri,November 8, 2019 03:52 AM

నిర్మల్‌టౌన్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ రెవెన్యూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు విజయారెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. జేసీ భాస్కర్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు అతీక్‌అహ్మద్, శ్రీకాంత్, కరీం, నలందప్రియ, ప్రభాకర్, రవికుమార్, ప్రకాశ్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సభ్యులు పెన్షనర్ల కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులపై దాడులు చేయడం హేయమైన చర్యని ఆ సంఘం నాయకులు ఎంసీ లింగన్న, మెరుగు సత్యనారాయణ, విలాస్, రమేశ్, కిషన్‌రావు, బొడ్డు లక్ష్మణ్ తదితరులు పేర్కొన్నారు. నిర్మల్ టీఎన్జీవో నాయకులు ప్రభాకర్, రవికుమార్, చక్కెర శ్రీనివాస్, సృజన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...