నెరవేరనున్న దశాబ్దాల కల


Wed,November 6, 2019 11:41 PM

-చివరి దశలో వంతెన నిర్మాణ పనులు
-రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మాణం
-30 కిలోమీటర్లు తగ్గనున్న దూరభారం
-మెరుగుపడనున్న ఉమ్మడి ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాల రవాణా సంబంధాలు

కడెం : మండలంలోని బెల్లాల్, జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపెల్లి గ్రామాలను కలుపుతూ గోదావరి నదిపై కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వంతెన నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. రెండు జిల్లాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. రెండు జిల్లాలను కలుపుతూ బెల్లాల్-బోర్నపెల్లి మధ్య గోదావరిపై వంతెన నిర్మిస్తామని 2015లో జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభు త్వం నిధులు విడుదల చేయగా, 2016 ఏప్రిల్ 6న అప్పటి రహదారుల, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కవిత పనులను ప్రారంభించారు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నా యి. 19 పిల్లర్లతో వంతెన నిర్మించాలని హైదరాబాద్‌కు చెం దిన ఆర్‌ఎస్‌వీ నిర్మాణ సంస్థ మొదట భావించినప్పటికీ ఆ తరువాత 21 పిల్లర్లతో వంతెన నిర్మాణం చేపట్టారు. భారీ యంత్రాల సహాయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

దూరంకానున్న ఇబ్బందులు
గోదావరిపై వంతెన నిర్మించాలని అటు రాయికల్ మండలం, ఇటు కడెం మండలంలోని ప్రజలు గత పాలకులకు ఏండ్లుగా విన్నవించారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రూ.70 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణ పనులను చేపట్టింది. బ్రిడ్జికి ఇరువైపుల అప్రోచ్‌రోడ్డుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సేకరించగా, రాయికల్ నుంచి బోర్నపెల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. నిర్మాణ పనులు పూర్తయితే రానున్న రోజుల్లో రెండు జిల్లాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇన్నాళ్లు కడెం మండల ప్రజలు రాయికల్, జగిత్యాల, కరీంనగర్‌కు వెళ్లాలంటే ఖానాపూర్, జన్నారం మండలాల మీ దుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉం డే ది. కానీ వంతెనపై నుంచి రాకపోక లు ప్రారంభమైతే 30 కిలోమీటర్ల దూరభారంతగ్గనుంది. కలసాకారమైంది వంతెన ప్రారంభమైతే కడెం, రాయికల్ మండలాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి.గతంలో మా ఊరి నుంచి కరీంనగర్ జిల్లాకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లం. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణంతో దూరభారం తగ్గనుంది. ఏం డ్ల నాటి కల సాకారం కానుంది. - కన్నె శ్రీనివాస్, బెల్లాల్

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...