అధిక పాల ఉత్పత్తికి చర్యలు


Wed,November 6, 2019 11:39 PM

కడెం :కృత్రియ గర్భధారణ ప్రక్రియ ద్వారా రైతులు అధిక పాల ఉత్పత్తి చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించేలా పశుసంవర్ధకశాఖ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ రమేశ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఖానాపూర్ నియోజకవర్గ స్థాయి పశువైద్యులు, పారావెటర్నరీ సిబ్బంది, గోపాల మిత్రలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కృషి కల్యాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసుకొని, ప్రతి గ్రామంలో 200 పశువులకు అధిక పాల ఉత్పత్తికి కోసం అంబోతుల వీర్యంతో కృత్రియ గర్భధారణ చేయనున్నట్లు తెలిపారు. ఎదకు వచ్చిన పశువులకు ఫీజు లేకుండా కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ ఇస్తారని అన్నారు.

దీంతో పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం బ్రీడింగ్ సీజన్ కావడంతో ఎదకు వచ్చిన పశువులకు రైతులు కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ వేయించేలా వారికి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఆసక్తిగల రైతులు సంబంధిత పశువైద్య సిబ్బంది, ఆయా గ్రామాల గోపాలమిత్రలను ఫోన్ లో సంప్రందించాలని అన్నారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రైతులు ఫోన్ చేస్తే అధికారులు ఇంటికి చేరుకొని పశువులకు కృత్రియ గర్భోత్పత్తి ఇంజక్షన్ వేస్తారని అన్నారు. సమావేశంలో డాక్టర్ సురేశ్, ఏడీలు నారాయణ, విజయ్, కడెం పశువైద్యాధికారి విజయ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...