సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న ఏఎస్పీ


Wed,November 6, 2019 11:39 PM

బాసర : శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని బుధవారం నిర్మల్ ఏఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల ఆయన నిర్మల్ ఏఎస్పీగా బదిలీ కావడంతో తొలి సారిగా అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఆలయ గర్భగుడిలో ఏఎస్పీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలను అందించారు. ఏఎస్పీ వెంట ముథోల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రాజు, రాజన్న, నర్సింహారెడ్డి ఉన్నారు.

బాధ్యతల స్వీకరణ
నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ: జిల్లా అడిషనల్ ఎస్పీగా శ్రీనివాస్‌రావు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్‌రావు హైదరాబాద్ సీపీ కార్యాలయం నుంచి బదిలీపై నిర్మల్‌కు వచ్చారు. ఇదివరకు ఇక్కడ పని చేసిన దక్షిణామూర్తి జగిత్యాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. విధుల్లో చేరిన శ్రీనివాసరావు ఎస్పీ శశిధర్ రాజును మర్యాద పూర్వకంగా కలిశారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles