నేరాల నియంత్రణకు కృషి చేయాలి


Wed,October 23, 2019 02:26 AM

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసులతో నెల వారి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం ముందుంటుందన్నారు. జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే జాప్యం లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. నేరస్తులు రిమాండ్‌ అయినప్పుడు ప్రతీ సారి వారి ఇంటరాగేషన్‌ రిపోర్టులను సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో క్రమబద్ధీకరించాలని సూచించారు. దీనిద్వారా నేరస్తులు నేరం చేసే విధానం, వారి నేరాలకు సంబంధించిన వివరాలను అన్ని పోలీసు డాటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయన్నారు. సాక్షులకు సంబంధించి పూర్తి వివరాలను నాణ్యమైన డాటాను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు.

లేకుంటే పోలీస్‌ స్టేషన్‌ నుంచి కోర్టుకు వెళ్లిన తరువాత ఫైల్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతీ రోజు రియల్‌ టైమ్‌ చెకింగ్‌ చేయాలని అన్నారు. పోలీసు స్టేషన్‌ల వారీగా విధి నిర్వహణలో పోటీపడి నేరాలను తగ్గుముఖం పట్టించేందుకు కృషి చేయాలన్నారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు రివార్డులు ఉంటాయని అన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో పాటు దర్యాప్తునకు దోహదం చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు దక్షిణ మూర్తి, రాజేశ్‌భల్లా, డీఎస్పీలు టి.ఉపేందర్‌ రెడ్డి, వెంకటేశ్‌, సీఐలు జాన్‌దివాకర్‌, జీవన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, రమేశ్‌ బాబు, వేణుగోపాల్‌ రావు జిల్లాలోని ఎస్సైలు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...