ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు


Wed,October 23, 2019 02:26 AM

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: ఆర్టీసీ బస్సుల రాకపోకలకు, ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్య లు తప్పవని ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు గత 18 రోజులుగా సమ్మె చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సు సర్వీసులను నడిపిస్తుండగా, తాత్కాలిక సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిన 26 మంది ఆర్టీసీ ఉద్యోగులపై కేసులు నమోదు చేసి నివేదికను ఆర్టీసీ అధికారుల అప్పగించామని తెలిపారు. ఇటీవల సోన్‌ వద్ద ఆర్టీ సీ బస్సుల అద్దాలను ధ్వంసం చేసిన రాజేశ్వర్‌రెడ్డి, ముకుందాచారితో పాటు నిర్మల్‌ పట్టణంలో బ స్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేసినన సలీం, మహబూబ్‌, దశరథ్‌, కలీంను అరెస్ట్‌ చేశామన్నారు. భైంసా డిపో పరిధిలో ఆరుగురితో పాటు ఖానాపూర్‌లో 30 యాక్టు, 144 సెక్షన్‌ను ఉల్లంఘించిన 14 మందిపై కేసులను నమోదు చేసి క్రమ శిక్షణ చర్యల నిమిత్తం ఆర్టీసీకి రిపోర్టు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ, తాత్కాలిక సిబ్బంది విధులకు అడ్డుపడుతూ సంస్థ ఆస్తులకు నష్టం కలిగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీలు దక్షిణమూర్తి, రాజేశ్‌బల్లా, వెంకట్‌ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్‌దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...