పోస్టల్ ఉద్యోగులు సంఘటితం కావాలి


Mon,October 21, 2019 12:27 AM

ఎదులాపురం: సమస్యల పరిష్కారానికి పోస్టల్ ఉద్యోగులు సంఘటితం కావాలని నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్(సి), పోస్టుమెన్, గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగుల సంఘం తెలంగాణ సర్కిల్ అధ్యక్షుడు జి.నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సంఘం సమావేశానికి ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కార్యదర్శిగా పనిచేసి ఇటీవల సికింద్రాబాద్‌కు బదిలీపై వెళ్లిన సంఘ నాయకుడు శంకర్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగులంతా కలిసి ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకుంటుందని విమర్శించారు. 2006 నుంచి బకాయిఉన్న ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు కిషన్‌రావు, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివాజీ, ఆదిలాబాద్ డివిజన్ పోస్టల్ పర్యవేక్షకుడు టి.జె. ప్రభాకర్‌రాజు, వరంగల్ సర్కిల్ కార్యదర్శి ఖలీల్, సభ్యులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...