గిరిజనగూడేల్లో బోగి సందడి


Mon,October 21, 2019 12:27 AM

బోథ్, నమస్తే తెలంగాణ/నేరడిగొండ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గిరిజన గూడేల్లో బోగి సందడి ఆదివారం మొదలైంది. గ్రామ పటేండ్ల ఇంటి వద్ద కోడల్ దేవుళ్లకు పూజలు చేయడంతో గుస్సాడీ వేషధారణలు ప్రారంభమయ్యాయి. నెమలి పింఛం టోపీలు, దుడ్డు కర్రలు, గజ్జెలు, కన్నెలు, డో లు, తబలా, డప్పులు తదితర వస్తువులను గ్రామ పటేండ్ల ఇండ్ల వద్దకు తీసుకువచ్చారు. ప్రతి ఇంటినుంచి మహిళలు నైవేద్యాలు తయారు చేసి గ్రామ పటేల్ ఆధ్వర్యంలో పూజలు చేసి గుస్సాడీలకు సమర్పించారు. బోథ్ మండలంలోని అందూర్, మందబొగుడ, నాగాపూ ర్, సాంగ్వి, వజ్జర్, నిగిని, కంటెగాం, రేండ్లపల్లె, నేరడిగొండ మండలంలోని యాపల్‌గూడ, తర్నం(బి) గ్రాయాల్లో తదితర గూడేల్లో దండారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles