సాహితీ రంగంలో రాణించాలి


Mon,October 21, 2019 12:26 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: ఆసక్తి ఉన్నవారు సాహితీ రంగంలో రాణించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో కైతిక కవిమిత్ర, మహాత్మాగాంధీ జాతీయ స్ఫూర్తి పురస్కార గ్రహీత బంకట్‌లాల్ రచించిన వనాంజలి పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో కవులు, కళాకారులు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుస్తక రచయిత బంకట్‌లాల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే కవిగా రాణిస్తున్నారని కొనియాడారు. ఏజెన్సీలోని లంబాడా సాంప్రదాయాలను బయటి ప్రపంచానికి తెలియజేసేలా తీజ్ ఉత్సవాలను సీడీలుగా రూపొందించడంతో పాటు పుస్తకాలు రచించే స్థాయికి ఎదిగారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చారులత, ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షుడు లక్ష్మయ్య, సభ్యులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...