పాడికి ప్రోత్సాహం


Sun,October 20, 2019 03:54 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:జిల్లాలో పాడి పరిశ్రమాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆవుల పెంపకంతో పేదలు ఉపాధి పొందేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఐదు కొలాం గిరిజన కుంటుంబాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 257 అవులు, దూడలను పంపిణీ చేశారు. ఉట్నూర్ ఐటీడీఏ నుంచి కొలాం గిరిజనులకు ఉచితంగా ఆవులను పంపిణీ చేశారు. కర్ణాటకలోని బెల్గాంలో మిలటరీ డెయిరీకి చెందిన మేలురకమైన ఫీజ్‌వాల్ జాతి ఆవులతో పేద కుటుంబాల్లో ఉపాధి మెరుగుపడుతుందని అధికారులు అంటున్నారు. ఆవులు పంపిణీ చేసిన గ్రామాల్లో మేత పెంచేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆవుల పెంపకం ద్వారా పేదలకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోని బెల్గాం ఉన్న మిలటరీ డెయిరీని మూసివేస్తుండగా ఈ విషయాన్ని తెలుసుకున్న డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి విజయ డెయిరీ అధికారులను కర్ణాటకకు పంపించి వాటిని జిల్లాలోని రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ అధికారులను సంప్రదించి పేదలకు ఆవులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఆవును రూ.1000 చొప్పున కొనుగోలు చేయగా రవాణా ఇతర ఖర్చులకు రూ.10 వేల వరకు వెచ్చించారు. జిల్లాలోని ఐదు కొలాం గిరిజన గ్రామాలతో పాటు మరో 15 గ్రామాల్లోని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, పేదలకు ఆవులను పంపిణీ చేశారు. జైనథ్ మండలం జున్నిపాని, తలమడుగు మండలం సకినాపూర్, మావల మండలం వాఘాపూర్, ఉట్నూర్ మండలం రాంగూడ, కొలాంగూడ గ్రామాల గిరిజనులకు వాటిని పంపిణీ చేశారు. వీటితో పాటు రైతు ఆత్మహత్య చేసుకున్న 15 గ్రామాల కుటుంబాలకు ప్రజావాణిలో తమకు ఉపాధి కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్న మరి కొందరు పేదలకు ఆవులను పంపిణీ చేశారు. మేలు రకమైన ఫీజ్‌వాల్ జాతి ఆవులు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తాయని, పాల అమ్మకంతో పేదల ఉపాధి మెరుగు పడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.

పాల సేకరణ, గడ్డి పెంపకానికి చర్యలు
పేదలకు పంపిణీ చేసిన ఆవుల నుంచి పాలసేకరణ చేయడంతో పాటు మేత కొరత లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. పాలు పితకడం, ఆవుల పెంపకంతో పాటు ఇతర అంశాల్లో ఆవులు పంపిణీ చేసిన రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ నుంచి ఆవులకు షెడ్లను నిర్మించడంతో పాటు ఎండాకాలం ఇతర సీజన్‌లలో మేత కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తలమడుగు మండలం శకినాపూర్‌లో గడ్డి పెంపకానికి స్థలాన్ని గుర్తించామని, పశు సంవర్ధక శాఖ ద్వారా రైతులకు ఉచితంగా గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...