సదరం క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలి


Sun,October 20, 2019 03:53 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : దివ్యాంగులకు సదరం క్యాంపులు ఏర్పాటుచేసి సర్టిఫికెట్‌లు జారీ చేస్తామని కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సందరం క్యాంపుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేయాలని, సదరం క్యాంపుల్లో ఆయా ప్రాంతంలోని దివ్యాంగులు హాజరు అయ్యే విధంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని అన్నారు. క్యాంపుల నిర్వహణకు అవసరమైన శాఖల సహకారం, క్యాంపులో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు త్వరలో చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. రిమ్స్‌లో దివ్యాంగుల సహాయార్థం సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. దివ్యాంగుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకే ప్రతినెలా మూడో శనివారం దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆశన్న, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...