కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు


Sat,October 19, 2019 02:08 AM

ఎదులాపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు రిమ్స్ దవాఖానలో శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే ధ్రువపత్రాల పరిశీలన, అటెస్టేషన్ ఫారాలు స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. అభ్యర్థులకు వైద్య పరీక్షలు ప్రారంభించారు. ఎస్పీ విష్ణువారియర్ ఆదేశాల మేరకు ఆర్‌ఐలు ఓ.సుధాకర్‌రావు, కె.ఇంద్రవర్ధన్, పోలీస్ డాక్టర్ సి.ఆర్ గంగారాం ఆధ్వర్యంలో మొదటి రోజు 65 మంది అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందుగా ఫింగర్ ప్రింట్ విభాగం అధికారులు అభ్యర్థుల వేలిముద్రలు సేకరించారు. అనంతరం డాక్టర్ తిప్పెస్వామి నేతృత్వంలో వైద్యబృందం ఆర్థోపెడిక్, కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలకు 37 మంది పురుషులు, 28 మంది మహిళలు హాజరయ్యారు. ఈ నెల 26 వరకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఫింగర్‌ప్రింట్ అధికారులు కె.మార్కండేయ, డి.రమేశ్, కె.గణేశ్, డీపీవో జూనియర్ అసిస్టెంట్ జగదీశ్, ఏఆర్‌ఎస్సై వెంకటి తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...