ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు


Thu,October 17, 2019 11:51 PM

నిర్మల్ అర్బన్, నమస్తేతెలంగాణ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని సాయుధ దళ కార్యాలయంలో ఎస్పీ శశిధర్ రాజు ఆదేశాల మేరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం తమ శాఖ సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణామూర్తి, వెంకట్‌రెడ్డి, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నేడు మెగా రక్తదాన శిబిరం
పోలీసుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ శశిధర్‌రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులతో పాటు యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...