ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం


Sun,October 13, 2019 01:11 AM

పెంబి: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. కెమెరాల ఏర్పాటుతో గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. శనివారం మండలంలోని మందపల్లి గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ఎనిమిది సీసీ కెమెరాలను ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు తగ్గడంతో పాటు నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చాన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మందపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన ఎస్సై భవాని సేన్‌, గ్రామస్తులను ఎస్పీ అభినందించారు.

విద్యుత్‌ తీగలు అమర్చవద్దు..
పంట రక్షణకు పొలం చుట్టూ విద్యుత్‌ తీగలు అమర్చి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఎస్పీ సూచించారు. శనివారం మందపల్లి గ్రామంలో పోలీసుల ఆద్వర్యంలో పంట పొలాలకు అక్రమ విద్యుత్‌పై కళాజాత బృందం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పంట పొలాల్లో చుట్టూ విద్యుత్‌ తీగలు అమర్చితే వన్య ప్రాణులతో పాటు మనుషులకు ప్రమాదకరమన్నారు. మండలంలో ఇటీవల విద్యుత్‌ తీగలకు గురై ఇద్దరు చనిపోవడం బాధాకరమన్నారు. పంట పొలాల్లో విద్యుత్‌ తీగలు అమర్చకుండా ఇతర మార్గాల్లో రక్షించుకోవాలని సూచించారు. గతేడాది మండలంలోని తాటిగూడలో పంట రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ తీగల ఉచ్చులోపడి పులి కూడా చనిపోయిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, సీఐ జయరాంనాయక్‌, ఎస్సైలు భవాని సేన్‌, ప్రసాద్‌, ఏఈ శ్రీనివాస్‌, ఎఫ్‌ఎస్‌వో శ్రీలత, సర్పంచ్‌ చెర్పురి సుధాకర్‌, మహేందర్‌, నాయకులు భూమగౌడ్‌, సుదుల శంకర్‌, భోసు శ్రీనివాస్‌, రాజేందర్‌, భీమేష్‌ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...