సాహస పర్యాటకాన్నిప్రోత్సహిస్తే అభివృద్ధి


Sun,October 13, 2019 01:10 AM

నేరడిగొండ: జలపాతాల వద్ద అడ్వెంచర్‌ ఇండియా సాహస పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయని అడ్వెంచర్‌ క్లబ్‌ వ్యవస్థాపకుడు కె.రంగారావు అన్నారు. శనివారం యువ సాహస బృందం సభ్యులతో కలిసి మండలంలోని కుంటాల జలపాతం, ఇచ్చోడ మండలం గాయిత్రి జలపాతాలను సందర్శించారు. అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి 19 మంది సభ్యుల సాహస బృందం తరలివచ్చారు. సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కుంటాల, గాయిత్రి జలపాతాల వద్ద అనుకూల ప్రదేశాలు, కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలను అధ్యయనం చేశారు. క్రీడాకారులను అడ్వెంచర్‌ ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌, రాక్‌ ైక్లెంబింగ్‌ వంటి ఎన్నో సాహస క్రీడలు గతంలో ఇక్క డి ప్రదేశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం గాయిత్రి జలపాతం వద్ద ట్రయల్న్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఇందులో భాగం గా హైదరాబాద్‌ పరిసర ప్రాం తాల వారిని, స్థానికుల ద్వారా పెద్ద సంఖ్యలో సాహసికుల్ని తీసుకొచ్చి ఇందులో జరిగే సాహస క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ పరిసరాలను అధ్యయనం చేసి హైదరాబాద్‌లో గ్రూపుల వారీగా పెద్ద సంఖ్యలో సాహస క్రీడాకారులను హాజరయ్యేలా చేయనున్నట్లు తెలిపారు. అలాగే అడ్వెంచర్‌ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ పర్యాటకంగా మరింత ప్రగతి సాధించాలంటే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి పర్యాటకంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. ఈ సాహస క్రీడల ద్వారా జలపాతం ప్రాంతాలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయని వెల్లడించారు. సీనియర్‌ శిక్షకులు ఆర్‌.రాజేందర్‌ కుమార్‌, శిక్షకులు రాజ్యలక్ష్మి, శిరీష, వినయ్‌ మేడిగూడ ఆశ్రమ పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...