బందం చెరువుపై మాకే హక్కుంది


Sat,September 14, 2019 04:11 AM

సారంగాపూర్: మండలంలోని బందం చెరువుపై తమ కే హక్కు ఉందని, సారంగాపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం చెరువులో అక్రమంగా చేప పిల్లలను వదిలారని యాకర్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు అన్నారు. ఈ మేరకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ తాసిల్దార్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందం చెరువు ఎన్నో ఏండ్ల నుంచి తమ ఆధీనంలో ఉందని, చెరువుపై ఆధారపడి తాము జీవిస్తున్నామని, ఈ ఏడాది రూ.12వేల శిస్తు సైతం చెల్లించామన్నారు. సారంగాపూర్‌కు చెందిన మత్స్యకారులు చేపపిల్లలను వదలడం సరైంది కాదన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచ్ జంబుల రమణ, ఉపసర్పంచ్ సాయేందర్, యాకర్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు పాల్గ్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...