గ్రామాల్లో వైద్య సిబ్బంది సర్వే


Sat,September 14, 2019 04:10 AM

దిలావర్‌పూర్: నర్సాపూర్(జీ)మండలంలోని కుస్లీ, అంజనీతండా గ్రామాల్లో శుక్రవారం దిలావర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది సర్వే నిర్వహించారు. వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారితో పాటు పలువురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా వైద్యుడు శ్యామ్ మాట్లాడుతూ వైద్యసిబ్బంది నిర్వహిస్తున్న సర్వేకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించా రు. కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ రమణారెడ్డి, శేఖర్, వైద్యబృం దం వేణుగోపాల్, ఏఎన్‌ఎంలు, సర్పంచులు అంజనాబాయి, బడ్గరి స్వరూప, నాయకులు భూమేశ్‌యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...