గిరిజన శాఖ జేడీఎంను కలిసిన నాల్గోతరగతి ఉద్యోగులు


Sat,September 14, 2019 04:10 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేబీసీ నారాయణ ఆధ్వర్యంలో ఆ శాఖ జేడీఎం నవీన్ నికోలస్‌ను హైదరాబాద్‌లో కలిసి సమస్యలను విన్నవించారు. నాల్గో తరగతి ఉద్యోగులకు వార్డెన్లుగా, ఎఫ్‌ఏసీగా, జూనియర్ అసిస్టెంట్ అర్హతలను బట్టి ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సమస్యలు సైతం పరిష్కరించాలని కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగులు తెలిపారు. సుధీర్ కుమార్, సంతోష్, దొండి, రమేశ్, గోవింద్‌రావు, లక్ష్మణ్, జైతు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...